Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఈ మోటోరోలా ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Flipkart Diwali Sale : మోటోరోలా కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో, రెజర్ 60, ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు.

Flipkart Diwali Sale : కొత్త మోటోరోలా ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 సేల్ సందర్భంగా పండుగ డిస్కౌంట్లు, మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో లెనోవో యాజమాన్యంలోని మోటోరోలా అత్యంత పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్నింటిపై ఖతర్నాక్ డిస్కౌంట్లను అందిస్తోంది.

మోటోరోలా కంపెనీ ప్రధానంగా మోటో ఎడ్జ్ 60 ప్రో, మోటో రెజర్ 60, మోటో G96, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మరిన్నింటితో సహా అనేక మోడళ్లపై లిమిటెడ్ టైమ్ డీల్స్, ప్రత్యేక పండుగ ధరలను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ మోటోరోలాడీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు ఏ మోడల్ ఫోన్ కావాలో ఎంచుకుని కొనేసుకోండి.

మోటరోలా రేజర్ 60 : మోటోరోలా దీపావళి సేల్ ఆఫర్లలో మోటో రేజర్ 60 ఫోన్ క్రేజీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.49,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.10వేలు తగ్గింపుతో రూ.39,999 (8GB RAM + 256GB స్టోరేజ్) ధరకు లభ్యమవుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో : భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (8GB RAM + 256GB స్టోరేజ్) మోడల్ రూ.29,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా, ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో ఈ పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఇప్పుడు అన్ని ఆఫర్‌లతో సహా కేవలం రూ.24,999కే అందుబాటులో ఉంది. హై వేరియంట్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 12GB + 256GB మోడల్ ధర రూ.33,999 నుంచి రూ.28,999కు తగ్గింది. అయితే, టాప్-ఎండ్ (16GB + 512GB) వెర్షన్ అసలు ధర రూ.37,999 నుంచి తగ్గి ఇప్పుడు రూ.32,999కు లభిస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ : పండుగ ఆఫర్లలో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా భారీగా తగ్గింపు పొందింది. ఆసక్తిగల కొనుగోలుదారులు (8GB+256GB) వేరియంట్ ధర రూ. 18,999కు పొందవచ్చు. అయితే, (12GB + 256GB) వెర్షన్ ధర రూ. 20,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ మోడళ్లు మొదట వరుసగా రూ. 22,999, రూ. 24,999 ధరలకు లాంచ్ అయ్యాయి. ఈ సేల్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కూడా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.

మోటోరోలా G96 : మోటోరోలా జీ96పై రూ.3వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. (8GB + 128GB) వేరియంట్ ఇప్పుడు రూ.14,999కు లభిస్తుంది. (8GB + 256GB) వేరియంట్ ధర రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు. అన్ని పండుగ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.