Weather Updates: ఏపీలో పిడుగుల వర్షం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. బయటకు రావొద్దు..
విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

AP Rains
Weather Updates: ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల వానలు దంచికొడుతున్నాయి. అకస్మాత్తుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం (13-10-25) అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాన పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. పంట పొలాల్లో, చెట్ల కింద అస్సలు ఉండొద్దని హెచ్చరించింది. ఇక విజయనగరం జిల్లా గొల్లపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 32.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 32.2 మిల్లీమీటర్ల, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.