Ind Vs WI: ధోనీ సంప్రదాయాన్ని కొనసాగించిన గిల్.. ఫొటోల్లో దీన్ని గమనించారా?
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న వేళ గిల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫొటోలు చూడండి. ( All Photos Credit Goes to BCCI)

వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ ముందు నిలిచిన 121 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 35.2 ఓవర్లలో అలవోకగా ఛేదించింది.

కేఎల్ రాహుల్ (58 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సాయి సుదర్శన్ (39) జట్టును విజయ తీరాలకు చేర్చారు.

భారత క్రికెట్‌లో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అదే.. జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ట్రోఫీని అందించే గౌరవం ఇవ్వడం.

ఈ సంప్రదాయాన్ని మొదట కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించారు. తాజాగా, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ కూడా అదే బాటలో పయనించి అందరినీ ఆకట్టుకున్నారు.

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్న కెప్టెన్.. ఆ ట్రోఫీని యువ ప్లేయర్ నారాయణ్ జగదీశన్ చేతిలో పెట్టారు.

అనంతరం జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది అంతా కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.