కొత్త కరోనా వైరస్ రకం, ఇది 10రెట్లు ఎక్కువ డేంజర్

10TV Telugu News

మలేషియాలో కొత్త రకం కరోనా వైరస్ కనిపెట్టారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పది రెట్లు ఎక్కువ విధ్వంసానికి కారణం కాబోతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా మాటల్లో, “కొత్త మ్యుటేషన్ D614G కనుక్కొన్న తర్వాత ప్రపంచం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.”బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మలేషియాలో ఒకే చోట కొత్తగా 45 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. భారతదేశం నుంచి వచ్చిన ఓ రెస్టారెంట్ యజమాని నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందంట. రెస్టారెంట్ యజమాని 14 రోజుల నిర్బంధ నిబంధనలను ఉల్లంఘించాడు. అందుకు ఐదు నెలల జైలు శిక్ష, జరిమానా విధించారు. అతని నుంచి వ్యాప్తి చెందిన 45 మందిపై పరిశోధన చేసిన తరువాత, కొత్త రకం వైరస్ బయటపడింది. కొత్త D614G మాములుగా ఉన్న వైరస్ కంటే పది రెట్లు ఎక్కువ ప్రభావం..అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.అలాగని దీనిగురించి అంతగా భయపడాల్సిందిలేదు.. జూలైలో శాస్త్రవేత్తలు డి 614 జి మ్యుటేషన్‌ను కనుగొన్నారని ఆయన చెప్పారు. అయితే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరీక్షలో మ్యూట్ వెర్షన్ ఇంకా ఎదగలేదు, ఇతర విషయాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. కొత్త రకం వైరస్ మరింత తీవ్రమైన కరోనాకు కారణం అవుతుందని, అలాగని ఇంతవరకు ఎలాంటి ఆధారాలులేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది..


మరి టీకాపై ప్రభావం ఏమైనా ఉంటుందా? ఒక రకపు వైరస్ ఆధారంగా వ్యాక్సిన్ తయారవుతుంది. వాటికే అది సమర్ధంగా పనిచేస్తుంది. ఇలా రోజుకో కొత్తరకం బైటపడితే తయారవుతున్న వ్యాక్సిన్ పూర్తిగా వీటిపైన పనిచేయలేకపోవచ్చు. అసంపూర్తిగా కూడా మిగిలిపోవచ్చు. కాకపోతే WHO చెప్పిన దాని ప్రకారం… ఈ కొత్తరకం వైరస్ పూర్తిగా వేరేరకం కాదు. కోవిడ్ వ్యాక్సిన్‌లకు లొంగుతుందని అంటోంది.