DCW chief gets rape threats: ‘నిన్ను రేప్ చేస్తాం’.. అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతికి బెదిరింపులు

‘నిన్ను రేప్ చేస్తాం’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కి సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సినీ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ను తీసుకోవడంపై స్వాతి ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణం. తాజాగా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు స్వాతి ఓ లేఖ రాసి.. ‘మీటూ’ ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్‌పై కొందరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని చెప్పారు. దీంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి.

DCW chief gets rape threats: ‘నిన్ను రేప్ చేస్తాం’.. అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతికి బెదిరింపులు

DCW chief gets rape threats: ‘నిన్ను రేప్ చేస్తాం’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కి సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సినీ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ను తీసుకోవడంపై స్వాతి ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణం. తాజాగా, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు స్వాతి ఓ లేఖ రాసి.. ‘మీటూ’ ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్‌పై కొందరు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని చెప్పారు.

దీంతో సాజిద్ ఖాన్ ను 2018లోఇండియన్ ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని స్వాతి గుర్తు చేశారు. అంతేగాక, ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా దర్శకుడిగానూ అప్పట్లో ఆయన వైదొలిగాడని చెప్పారు. ఖాన్ కు ఇప్పుడు బిగ్‌బాస్‌ షోలో స్థానం ఇవ్వడం ఏంటని అన్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ లో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి.

ఇవాళ స్వాతి మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. అలాగే, తన ట్విటర్ లోనూ దీనిపై ట్వీట్లు చేశారు. తనను రేప్ చేస్తానని బెదిరిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయాలని కోరారు. సాజిద్ ఖాన్ గురించి కేంద్ర మంత్రి ఫిర్యాదు చేసినప్పటి నుంచి తనకు ఇన్ స్టాగ్రామ్ లో బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

తనను సాజిద్ ఖాన్ విషయంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీంతో తాను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. ‘‘#MeTooలో సాజిద్ ఖాన్ పై దాదాపు 10 మంది అమ్మాయిలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. హౌస్ ఫుల్ 4, హుమ్షాకల్స్ సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే దుస్తులు విప్పి చూపించాలని కొందరు మైనర్లను ఆడిషన్ల సమయంలో అడిగాడు’’ అని స్వాతి మీడియాకు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..