గూగుల్ Messages యాప్‌‌లో కొత్త ఫీచర్.. ఫోన్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 09:42 AM IST
గూగుల్ Messages యాప్‌‌లో కొత్త ఫీచర్.. ఫోన్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు

Google Messages app schedule feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. సర్వర్ ఆధారిత అప్ డేట్ ద్వారా గతవారమే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.



దీని ద్వారా యూజర్లు తమ ఫోన్ మెసేజ్ ఇన్ బాక్సులోని మెసేజ్ లను షెడ్యూల్ చేసుకోవచ్చు. గూగుల్ మెసేజెస్ యాప్ అందించే ‘షెడ్యూల్ మెసేజ్’ ఫీచర్ ద్వారా అనుమతినిస్తుంది.
https://10tv.in/googles-new-hum-to-search-feature-can-figure-out-the-song-thats-stuck-in-your-head/
ఫోన్ మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే ముందుగా Send బటన్‌ నొక్కి పట్టుకోవాలి. ఇక్కడ మీకు షెడ్యూల్ మెసేజ్ ఆప్షన్ మొబైల్ స్ర్కీన్ పై పాప్ అప్ అవుతుంది. ఇక్కడ మీకు Later Today (6:00 pm), Later tonight (9:00 pm), Tomorrow (8:0 am) అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.



అంతేకాదు.. అవసరమైతే Custom Date, Time ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. ఒకసారి తేదీ, సమయం సెట్ చేశాక Save బటన్ పై క్లిక్ చేయండి. ఇందులో మీకు Clock icon ఒకటి కనిపిస్తుంది. అక్కడే మెసేజ్ లు షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.

మీరు ఏ మెసేజ్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో దానిపై Tap చేయండి. షెడ్యూల్ చేసిన మెసేజ్ అప్ డేట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేయడం లేదా ఇతరులకు పంపవచ్చు.



ప్రస్తుతం ఈ కొత్త గూగుల్ మెసేజెస్ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని వారాల్లో అందరి యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.