India-New Zealand Second ODI : నేడు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే.. రాయ్ పూర్ స్టేడియంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగనుంది.

India-New Zealand Second ODI : నేడు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే.. రాయ్ పూర్ స్టేడియంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్

India and New Zealand (1)

India-New Zealand Second ODI : నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగనుంది. రాయ్ పూర్ స్టేడియంలో తొలిసారి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగబోతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. రాయ్ పూర్ లో 50 వేలకు పైగా అభిమానులు మైదానంలో సందడి చేయనున్నారు. రోహిత్, శుభ్ మన్ గిలి రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ కుదురుకోగా, మూడో స్థానంలో
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు.

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రూపంలో మిడిలార్డర్ కూడా బలంగానే కనిపిస్తున్నా.. యువ ఆటగాళ్లలో నిలకడ లేమి సమస్యగా కనిపిస్తోంది. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కా కాగా… స్పెషలిస్టు స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. వన్డే క్రికెట్ లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్న హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తో పాటు సీనియ్ మహమ్మద్ షమీ పేస్ భారాన్ని మోయనున్నారు. పిచ్ బౌన్స్ కు సహకరించనుందని కివీస్ శిబిరం భావిస్తున్న నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ కు తుది జట్టులో అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి.

Ind Vs NZ 1st ODI : ఉత్కంఠపోరులో న్యూజిలాండ్‌పై భారత్ విజయం.. సెంచరీతో చెమట్లు పట్టించిన బ్రేస్ వెల్

మరోవైపు సీనియర్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, సౌథీ అందుబాటులో లేకున్నా..
యువ ప్రతిభతో కివీస్ జట్టు బలంగా ఉంది. అలెన్, కాన్వే, నికోల్స్, మిషెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, శాంట్నర్ రూపంలో నాణ్యమైన ఆటగాళ్లకు జట్టులో కొదవ లేదు. వీరందరూ సమిష్టిగా రాణిస్తే.. ఇరు జట్ల మధ్య మరో రసవత్తర పోరు జరుగడం ఖాయం. ఇటీవల శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్ లు గెలిచి టీమిండియా ఫుల్ జోష్ మీద ఉంది.  ఈనెల 18న జరిగిన తొలి వన్డే మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది. హైదరాబాద్ లో విజయం అంత తేలిగ్గా వరించలేదు.

భారత జట్టు భారీ స్కోర్ చేసినా.. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. పోరాడటంలో తమకు సాటి లేరని న్యూజిలాండ్ ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. సగం పరుగులకు ముందే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. గెలుపుకు కేవలం 12 పరుగుల దూరానికి వచ్చి నిలిచిదంటే వారి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే జోరు కొనసాగించి సిరీస్ సమం చేయాలని కివీస్ భావిస్తోంది. కాగా, రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది.

ICC Fined Team India: న్యూజిలాండ్‌తో తొలివన్డేలో టీమిండియాకు జరిమానా విధించిన ఐసీసీ.. ఎందుకంటే?

భారత్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్,
హార్దిక్, సుందర్, శార్దూల్/ఉమ్రాన్, కుల్దీప్, షమీ, సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు : లాథమ్ (కెప్టెన్), అలెన్, కాన్వే, నికోల్స్, మిషెల్, ఫిలిప్స్, మిషెల్ బ్రాస్ వెల్,
శాంట్నర్, సోథి, డగ్ బ్రాస్ వెల్, ఫెర్గూసన్.