ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

10TV Telugu News

158 new corona cases files in AP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 158 కరోనా కేసులు నయోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,86,852కు చేరింది.

విశాఖపట్నంలో ఒకరు కరోనాతో మృతి చెందడంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,147కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,78,232కు చేరింది.

10TV Telugu News