చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలి : అంబటి రాంబాబు

చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 05:37 AM IST
చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలి : అంబటి రాంబాబు

చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతుండా చంద్రబాబు తన సీటు దగ్గరి నుంచి ఆనంపైకి వచ్చేందకు ప్రయత్నం చేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఇంతలో అచ్చెన్నాయుడు అడ్డువచ్చారని..ఒకవేళ అడ్డురాకపోతే ఏం జరిగివుండేదో అర్థం కాలేదన్నారు. ఇది సభా సంప్రదాయం కాదన్నారు. చంద్రబాబు బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేమన్నారు. చంద్రబాబు వైఖరిని అంబటి తప్పుబట్టారు. చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం సంప్రదాయం కాదని వైసీపీ నేత ఆనం నారాయణ రెడ్డి అన్నారు. టీడీపీ కొత్త సంప్రదాయాలకు తెర తీస్తోందన్నారు. అరాచక శక్తులు అన్న పదంపై ఆనం అభ్యంతరం తెలిపారు. టీడీపీ నేతలు స్పీకర్ ను కూడా బెదిరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ ను గౌరవించకపోవడం ఇదేం సంప్రదాయమని ప్రశ్నించారు. 

ప్రశ్నోత్తరాల్లో నిరసనకు అవకాశం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అరాచక శక్తులు అన్నపదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. సభ్యులు హక్కులను చంద్రబాబు గౌరవించాలన్నారు.