అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ ను ఫోటో తీసిన వైజాగ్ యువతి

  • Published By: nagamani ,Published On : July 30, 2020 / 02:01 PM IST
అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ ను ఫోటో తీసిన వైజాగ్ యువతి

ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ను విశాఖపట్టణం అమ్మాయి మొదిలి వైష్ణవి భవ్య ఫోటో తీసింది. ‘కామెట్ నియోవైస్’ ఫొటో తీయటానికి వైష్ణవి కొన్ని రోజులపాటు శ్రమపడింది.కానీ శ్రమకు తగిన ఫలితం దక్కింది. దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం నాటి దుమ్ము, ధూళితో నిండిన “కామెట్‌ నియోవైస్‌’ తోకచుక్క భూమి ఉత్తర ధృవప్రాంతంలో ఆకాశంలో సందడి చేస్తున్న ఆ తోకచుక్కను ఎట్టకేలకు ఆ అత్యంత అరుదైన తోకచుక్కను తన కెమెరాలో బంధించగలిగింది.

వాతావరణం సహకరించక కొన్నిసార్లు..వాతావరణంలో ధూళి కణాల వల్ల ఇంకొన్నిసార్లు ఈ తోకచుక్క సరిగా కనిపించేది కాదు. ఎండలు కాస్తూ వాతావరణం సహకరించడంతో జులై 26న శొంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద సూర్యాస్తమయ సమయంలో “కామెట్‌ నియోవైస్‌’ మొత్తానికి వైష్ణవి కెమెరాకు చిక్కింది.మిలమిలా మెరుస్తూ వెళుతున్న అద్భుతమైన దృశ్యాన్ని భవ్య తన కెమెరాలో బంధించింది.

కామెట్ నియోవైస్ తోకచుక్క పూర్తిగా దుమ్ము, ధూళితో నిండి పోయి..భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తున్న ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చిలో నాసా తన నియోవైస్‌ ఉపగ్రహంలోని ఇన్‌ఫ్రారెడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించింది. ఇది అత్యంత అరుదైన తోక చుక్కని నాసా తెలిపింది.