చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 01:41 PM IST
చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు.. ప్రజలెవరూ చికెన్, మటన్ తినొద్దని చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. కోళ్ల ఫారాల్లో అంతుచిక్కని వైరస్ సోకి వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో చనిపోయిన కోళ్లను కాల్వల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వారం రోజులు మాంసం ఉత్పత్తుల అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

తణుకు నియోజకవర్గంలో ఓ వైరస్‌ కారణంగా ఫారాల్లోని కోళ్లన్నీ చనిపోతున్నాయని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన వైరస్ కోళ్లను కాలువల్లో, రోడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామన్నారు.

తణుకులో ఫౌల్ట్రీ పరిశ్రమను ఓ వైరస్ వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఫారాల్లో కోళ్లన్నీ పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే.. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని రోజుల పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండటమే మంచిదన్నారు. అసలే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఈ క్రమంలో తణుకులో వచ్చిన వైరస్ స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ వైరస్ ఏమిటి? ఎందుకు కోళ్లు చనిపోతున్నాయి? దానికి వ్యాక్సిన్ ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.

Read More>>బీజేపీ,కాంగ్రెస్ ఓటర్లకు కూడా నేనే సీఎం..ఆశీర్వదించండి మోడీజీ