మచిలీపట్నం సెంట్రల్‌బ్యాంక్‌లోరూ.6.71 కోట్ల కుంభకోణం..గోల్డ్‌లోన్స్‌లో చీటింగ్

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 05:13 AM IST
మచిలీపట్నం సెంట్రల్‌బ్యాంక్‌లోరూ.6.71 కోట్ల కుంభకోణం..గోల్డ్‌లోన్స్‌లో చీటింగ్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్‌లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. బ్యాంక్ నిబంధలను విరుద్ధంగా రూ.6.71 కోట్లు లోన్ తీసుకున్నట్లుగా విచారణలో గుర్తించారు. అప్రైజరర్ చేతివాటానికి బ్యాంక్ సిబ్బంది కూడా సహకరించారు. అప్రైజర్ తో కలిసి అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టి మోసానికి పాల్పడడ్డారు.

బంగారం విషయంలో బ్యాంకు సిబ్బంది మోసాలకు పాల్పడ్డారనే విషయా తెలుసుకున్న ఉన్నతాధికారులు బ్యాంకులో పెట్టిన ఖాతాదారులంతా తమ బంగారాన్ని పరిశీలించుకోవాలనీ..కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. దీంతో 500లమంది ఖాతాదారులు సెంట్రల్ బ్యాంకుకు క్యూకట్టారు. చిలకపూడి పోలీసులకు సెంట్రల్ బ్యాంకు రీజనల్ మేనేజర్ ఫిర్యాదు చేయటంతో ఈ బంగారం కుంభకోణం బైటపడింది.   

వివరాల్లోకి వెళితే..మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకు బ్యాంక్‌ అప్రయిజర్ బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు తెలిచి గోల్డ్ లోన్స్ తీసుకుని డబ్బు స్వాహా చేశాడు. సుమారు 500 మంది ఖాతాదారుల పేరుతో దొంగ బంగారాన్ని తనఖా పెట్టి లక్షల్లో బ్యాంకుకు టోపీ పెట్టాడు. అనుమానం వచ్చిన రీజనల్ మేనేజర్ నగలు తనిఖీ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నగలు సరి చూసుకోవాలని బ్యాంక్ ఖాతాదారులకు మేనేజర్ విజ్ఞప్తి చేశారు. మేనేజర్ నుంచి మెసేజ్ రావడంతో గోల్డ్ లోన్లు తీసుకున్న వారు ఆందోళనతో బ్యాంకుకు క్యూకట్టారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటంతో మొత్తం రూ.6.71 కోట్ల బంగారానికి సంబంధించి కుంభకోణం జరిగినట్లుగా వెల్లడైంది. 

See Also | భలే మంచి చౌక బేరం.. చికెన్ కిలో రూ.30