ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 12:12 AM IST
ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు. నగరంలోని మూడో టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం (జనవరి 21, 2020) కేసు నమోదు చేశారు. 

నగరంలోని ఓ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణల విషయమై ఎంపీ తన ఫేస్‌బుక్‌ ఖాతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ కేసు విషయమై అర్వింద్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనే స్పందించారు. బ్యూరోక్రాట్‌ల విజ్ఞప్తి మేరకు ఈ పోస్టును తొలగించానని చెప్పారు. అయినప్పటికీ అధికారులు కేసులు పెడతామంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం (జనవరి 22, 2020) మున్సిపల్‌ పోలింగ్‌ సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారంటూ అర్వింద్‌ పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై కూడా మరో కేసు నమోదు చేసే యోచనలో పోలీసుశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసుల విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.