టార్గెట్ టీడీపీ : అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ యోచనలో ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 08:56 AM IST
టార్గెట్ టీడీపీ  : అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ యోచనలో ప్రభుత్వం

ఏపీ  కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం  నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్రదించాలని మంత్రి వర్గ సమావేశం భావించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు భూకొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో దానిపై చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం జగన్ కేబినెట్ నిర్ణయించింది. 

‘‘బాగా బలిసిన కోడి వచ్చి..
ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..‘‘….కోడి వచ్చి..ఇల్లు ఎక్కి అరిచినట్లుగా’’ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అమరావతికి సంబంధంచిన భూముల్లో మాకేమీ లేవని పెద్ద పెద్ద నేతలందరూ మాట్లాడుతున్నారనీ.. ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు నేతలు..వారికి సంబంధించి బంధుమిత్రులు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినవారిలో ఉన్నారని మంత్రి పేర్ని నాని స్పష్టంచేవారు.దీనికి సంబంధించి అన్ని వివరాలు మాదగ్గర ఉన్నాయన్నారు.  బినామీల పేరుతో భారీ ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడిన నేతల మాకే ఎదురు సవాల్ విసురుతున్నారు.   
వివరాల్లో టీడీపీ నేతల పేర్లు చాలానే ఉన్నాయనీ కానీ వారు బుకాయిస్తున్నారు. అబద్దాలాడుతున్నారు.  సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి తామకేమీ తెలీదంటున్నారు..వారి సంగతి తేల్చటానికే..సీబీఐ లేదా సీబీసీఐడీ లేదా లోకాయుక్తతో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. 

మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతి ఏర్పడింది కాబట్టి సీఎం జగన్ చంద్రబాబుని టార్గెట్ గా చేసుకుని   ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు వెళ్లే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ కు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం సలహాలు తీసుకున్నారు. అవన్నీ కలిపి నివేదిక సిద్దం చేయటం..ఈ  నివేదిక సీఎం జగన్ కు చేరటం..దీంతో ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేసారు. 

దీంట్లో భాగంగా..రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన సీబీఐ విచారణకు ఇవ్వాలని పలువురు మంత్రులు కేబినెట్ సమావేశంలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.  దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.  అదే సమయంలో కేంద్రంతోనూ చర్చించాలని భావిస్తున్నారు.

రాజధాని పైన వివాదం సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారి పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఎం జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబుతో పాటు పలు పార్టీలు కూడా అమరావతిలో   సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవం అయితే దానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
దీంతో..తాజగా రాజధాని మార్పుల ప్రతిపాదన తరుణంలోనే ఈ అంశం పైన చర్యల దిశగా సీఎం జగన్  ప్రభుత్వం అడుగులు వేస్తోంది.