బాబు విదేశీ టూర్‌పై కేంద్రం ఆంక్షలు

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 04:40 AM IST
బాబు విదేశీ టూర్‌పై కేంద్రం ఆంక్షలు

విజయవాడ : కేంద్రం..ఏపీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. ఆయన పర్యటనకు అనుమతినిస్తూనే పలు ఆంక్షలు పెట్టడంపై బాబు గుస్సా అవుతున్నారు. మరోసారి అప్లై చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం…
2019, జనవరి 20 నుండి 26వ తేదీ వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు బాబు దావోస్‌కు వెళుతుంటారు. ఈసారి కూడా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బాబుతో పాటు మంత్రులు..అధికారులు కూడా వెళ్లనున్నారు. ఇందుకు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉండడంతో వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకుంది.పర్యటనకు కేంద్రం ఒకే చెబుతూనే పలు ఆంక్షలు విధించింది. బాబు వెంట 14 మంది ఎందుకు ? నలుగురికే అనుమతినిచ్చింది. ఏడు రోజులు బదులుగా నాలుగు రోజులకే కుదించుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 
ప్రతి ఏటా సమావేశాలు…
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటుంటారు. రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. బాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం పట్ల ఎలాంటి రాజకీయ దుమారం చెలరేగనుందో చూడాలి.