అమరావతిలో షాకింగ్ : 797మంది తెల్ల రేషన్ కార్డుదారులు.. 761ఎకరాల భూములు కొనుగోలు

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర

  • Published By: veegamteam ,Published On : January 23, 2020 / 06:54 AM IST
అమరావతిలో షాకింగ్ : 797మంది తెల్ల రేషన్ కార్డుదారులు.. 761ఎకరాల భూములు కొనుగోలు

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. అమరావతి ప్రాంతంలో తెల్ల రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. మంగళగిరి, తుళ్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి వారి వివరాలు సేకరించారు అధికారులు. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 761 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది.

నెలకి రూ.5వేలు ఆదాయం కూడా రాని తెల్ల రేషన్ కార్డుదారులు రూ.300 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేయడం షాక్ కి గురి చేసింది. తుళ్లూరు, తాడికొండ, పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, అమరావతి ఏరియాల్లో భూములు కొన్నట్టుగా సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. అత్యధికంగా తుళ్లూరులో 245 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 

తెల్ల రేషన్ కార్డుదారులపై చీటింగ్, బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలు, ఆధార్ కార్డులు, అడ్రస్ లు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు పంపారు. ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకున్నారు ఐటీ అధికారులు. 

* రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్యలకు రంగం సిద్ధం
* ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేపట్టిన సీఐడీ
* విచారణ కోసం 4 బృందాలు ఏర్పాటు
* 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు నమోదు
* రూ.3 కోట్ల చొప్పున 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్దారణ

* కొనుగోలుదారుల వివరాలు సేకరిస్తున్న సీఐడీ
* 129 ఎకరాలు కొనుగోలు చేసిన 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు
* పెదకాకానిలో 40 ఎకరాలు కొనుగోలు చేసిన 43మంది తెల్ల రేషన్ కార్డుదారులు
* తాడికొండలో 188 మంది 180 ఎకరాలు కొనుగోలు
* తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు కొనుగోలు

* మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు కొనుగోలు
* తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొనుగోలు
* టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం
* మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలపై కేసు నమోదుకు రంగం సిద్ధం

Also Read : బీజేపీ అనుమతి లేదు : 3 రాజధానులపై వైసీపీది తప్పుడు ప్రచారం