మురుగు కాల్వను క్లీన్ చేసిన అమల

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 07:07 AM IST
మురుగు కాల్వను క్లీన్ చేసిన అమల

బోధన్ : సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే అమల తనదైన శైలిలో చెత్తను శుద్ధి చేశారు. ఓ శుభకార్యానికి వెళ్లిన అమల డ్రైనేజీలోని చెత్తను చూసి చీపురు పట్టుకుని దాన్ని క్లీన్ చేశారు. ఆమె అలా క్లీన్ చేస్తుంటే స్థానికులంతా ఆశ్చర్యపోయారు. 
 

నిజామాబాద్ జిల్లా బోధన్ లని ఖండ్ గాంలో ఓ శుభకార్యక్రమానికి వెళ్లిన అమల స్థానికం గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లారు. స్కూల్ వద్ద ఉన్న మురుగు కాల్వ మొత్తం చెత్తగా ఉండటంతో… స్వయంగా చీపురు పట్టి మురుగు కాల్వలోని చెత్తను శుభ్రం చేశారు. ఈ పని చేసినప్పుడు అమలు చేతికి కనీసం  గ్లోవ్స్ కూడా వేసుకోకుండా…ఎంతో చిత్తశుద్ధితో ఆ పనిని పూర్తి చేసి అందరితో ‘ఔరా’ అనిపించుకున్నారు. తరువాత ఆమె స్థానికులతోను..విద్యార్ధులతోను మాట్లాడారు. ఎవరి గ్రామాన్ని వారే శుభ్రం చేసుకోవాని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరు దీన్ని తమ బాధ్యతగా భావించి కొనసాగిస్తే ఆరోగ్య గ్రామాలను నెలకొల్పవచ్చని తెలిపారు. విద్యార్ధులంతా స్కూల్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ..అప్పుడు ఎటువంటి అనారోగ్యాలు రావని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్పారు.