గ్యాంగ్ రేప్‌కు ఒప్పుకోలేదని కాలేజీ విద్యార్థినికి నిప్పు.. యూపీలో షాకింగ్ ఘటన

10TV Telugu News

College Student Gangrape: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాలిన గాయాలతో నగ్నంగా ఓ విద్యార్థిని జాతీయ రహదారి పక్కన పడి ఉండటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న షాజహాన్ పూర్ పోలీసులు దర్యాఫ్తుని ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ ను ప్రతిఘంటించడంతో దుండగులు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితురాలు స్వయంగా చెప్పింది. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంప్ రేప్ యత్నం:
దీనిపై షాజహాన్ పూర్ ఎస్పీ ఆనంద్ స్పందించారు. ఫిబ్రవరి 22న రాయ్ కేదా గ్రామం దగ్గర పొలాల్లో ముగ్గురు దుండగులు తనను రేప్ చేయబోయారని, ప్రతిఘటించడంతో తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని.. బాధిత విద్యార్థిని తమతో చెప్పిందని, షాజహాన్ పూర్ ఎస్పీ తెలిపారు. అయితే, బాధితురాలు ఒక్కోసారి ఒక్కో విధంగా చెబుతోందని ఎస్పీ చెప్పారు. కాలేజీ బిల్డింగ్ నుంచి ఆసుపత్రికి ఎలా వచ్చానో తనకు తెలీదని బాధితురాలు చెబుతోందన్నారు. ప్రస్తుతాన్ని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని లక్నోలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ సివిల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.

cop rape attempt

కాలేజీ నుంచి ఒంటరిగా వెళ్లిన యువతి:
”ఈ కేసుని విచారిస్తున్నాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. కాలేజీ క్యాంపస్ గోడకు రంధ్రం ఉంది. అందులోంచి విద్యార్థిని కాలేజీ నుంచి బయటకు వెళ్లిపోయింది. కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించిన 20 నిమిషాలకే ఆమె ఆ రంధ్రం నుంచి వెళ్లిపోయింది. అమ్మాయి ఒంటరిగా కెనాల్ రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది” అని పోలీసులు తెలిపారు.

Young woman gang-raped for two days in Madhya Pradesh

నిజమే చెప్పిందా?
అసలేం జరిగింది? విద్యార్థిని ఒంటరిగా కాలేజీ నుంచి బయటకు ఎందుకు వెళ్లింది? ఎక్కడికి వెళ్లింది? ఆమెపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరు? ఆమె నిజమే చెబుతోందా? ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డీఎస్పీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ బృందాలు దర్యాఫ్తు చేపట్టాయి.

raped

రోడ్డు పక్కన నగ్నంగా విద్యార్థిని:
బాధితురాలు కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలోని సుఖ్‌దేవానంద్ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతోంది. సోమవారం(ఫిబ్రవరి 22,2021) తండ్రితో కలిసి కాలేజీకి వెళ్లింది. ఆ తర్వాత కూతురిని తీసుకురావడానికి తండ్రి కాలేజీకి వెళ్లాడు. కళాశాల ముగిసినా ఆమె బయటకు రాలేదు. ఆందోళన చెందిన తండ్రి ఆమె కోసం వెతకులాట ప్రారంభించాడు. ఇంతలో పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. లక్నో-బరేలీ జాతీయ రహదారి పక్కన ఓ యువతి పడి ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న యువతిని చూసి పోలీసులు షాక్ తిన్నారు. తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

10TV Telugu News