పెళ్లి వేడుకల్లో DJ చిచ్చు : వరుడిని చితక్కొట్టిన వధువు బంధువులు

ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే

  • Published By: veegamteam ,Published On : November 1, 2019 / 07:43 AM IST
పెళ్లి వేడుకల్లో DJ చిచ్చు : వరుడిని చితక్కొట్టిన వధువు బంధువులు

ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే

ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఒకరినొకరు తన్నుకున్నారు. కుర్చీలు, బిందెలు ఇలా ఏది దొరికితే దానితో చితకబాదుకున్నారు.

కోదాడ మండలం తొగర్రాయిలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన అజయ్‌కు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఇంద్రజతో ఇరువురు బంధుమిత్రుల ఆనందోత్సాహల మధ్య ఘనంగా వివాహం జరిగింది. ఆ తరువాత అందరూ విందు ఆరగించారు. సాయంత్రం అమ్మాయి ఇంటికి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈలోగా ఊరిలో ఊరేగింపు కోసం డీజే మాట్లాడుకున్నారు. అంతా డ్యాన్స్‌లు చేస్తూ నూతన వధువరులను సాగనంపుతున్నారు. ఈ లోగా.. కొందరు యువకులు డిజేను కాసేపు ఆపాలని పట్టుబట్టారు. అమ్మాయి తరపు వారు తమకు ఆలస్యమవుతుందని త్వరగా వెళ్లాలన్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరపు బంధువుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

పెళ్లి కొడుకు అజయ్.. పెళ్లి కూతురు తరపు బంధువులపై చేయి చేసుకోవడంతో ఘర్షణ మొదలైంది. అమ్మాయి తరపు వారు సహనం కోల్పోయారు. పెళ్లి కొడుకును చితకబాదారు. దీంతో అబ్బాయి తరపు వారు కూడా రెచ్చిపోవడంతో పెళ్లి ఇల్లు కాస్తా రణరంగంగా మారింది. కుర్చీలు గాల్లోకి లేచాయి. తలలు పగిలాయి. ఇరు వర్గాల ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.