మళ్లీ కలకలం : పోలవరం దగ్గర భూమిలో పగుళ్లు

పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 05:47 AM IST
మళ్లీ కలకలం : పోలవరం దగ్గర భూమిలో పగుళ్లు

పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి

పోలవరం ప్రాజెక్టు దగ్గర మరోసారి కలకలం చెలరేగింది. భూమిలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా భూమి కుంగుతోంది. 902 కొండ దగ్గర 30 అడుగుల మేర భూమి కుంగిపోయింది. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియచేశారు. ప్రమాదం జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివేణి గ్యారేజీ నుంచి యంత్రాలను తరలించారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర భూమి కుంగడం సర్వసాధారణమై పోయింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వేగంగా పనులు పూర్తి చెయ్యాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోవడంతో పనులకు బ్రేక్ పడుతోంది.

మెకానికల్‌ షెడ్‌లోనూ భారీగా పగుళ్లు తీయడంతో యంత్రాలు, వాహనాలు, సామగ్రిని వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెండవ విడత ఖాళీ చేయాల్సిన 19 గ్రామాల నిర్వాసితులు రాకపోకలు సాగించేందుకు.. ప్రాజెక్ట్‌ మార్గానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గం సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భూకంపం మాదిరిగా ఇక్కడ భూమి బీటలు వారి పగుళ్లు తీసి కుంగిపోవడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఘటనతో పోలవరం ప్రాంత వాసుల్లో భయం పెరిగింది. 2018 నవంబర్‌ 4వ తేదీన ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి 100 మీటర్ల పొడవున, 6 మీటర్ల ఎత్తున పెద్దపెద్ద నెర్రలు ఏర్పడి భూమి పైకి ఉబికింది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. ప్రాజెక్ట్‌ ప్రాంతానికి వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. 2019 ఫిబ్రవరి 24న మరోసారి స్పిల్‌వే రెస్టారెంట్‌ ఎదురుగా ప్రాజెక్ట్‌ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గం పైకి ఉబికి బీటలువారి పగుళ్లు తీసింది. రెస్టారెంట్‌ చుట్టూ ఉన్న సిమెంట్‌ కట్టడాలు పగిలిపోయాయి. రెస్టారెంట్‌ లోపల గచ్చు విడిపోయింది. అప్పట్లో ప్రాజెక్ట్‌ అధికారులు వెంటనే అక్కడికు చేరుకుని రోడ్డు మార్గాన్ని సరిచేశారు. శనివారం (ఏప్రిల్ 27, 2018), ఆదివారం (ఏప్రిల్ 28,2019) మరోసారి 902 హిల్‌ వ్యూ ప్రాంతంలోనూ అదే విధంగా ఘటన చోటుచేసుకుంది. భూమిపై 2 అడుగుల వెడల్పున గోతులు ఏర్పడ్డాయి. 20 మీటర్ల పొడవున భూమి బీటలు వారింది.