టెక్ ట్రాన్పరెంట్ టాయిలెట్స్‌ : ఏం సిగ్గు పడక్కర్లేదు

  • Published By: nagamani ,Published On : August 20, 2020 / 10:23 AM IST
టెక్ ట్రాన్పరెంట్ టాయిలెట్స్‌  : ఏం సిగ్గు పడక్కర్లేదు

టాయ్ లెంట్ అంటే..నాలుగు గోడల మధ్య ఎవ్వరూ కనిపించని ప్రాంతంలో ఉండాలి. బహిరంగంగా టాయ్ లెట్ పనులు చేసుకోవటమంటే ఎంత సిగ్గో అందరికీ తెలిసిందే. మరుగు అనేది ఉండాలి. అందుకే ప్రకృతి ధర్మాన్ని తీర్చుకునేందుకు మరుగుదొడ్లు అనే పేరు వచ్చింది. కానీ మరుగు లేకుండా మరుగుదొడ్డిని ఉపయోగించగలమా…మన అవసరాలు తీర్చుకోగలమా? అంటే ఎంత సిగ్గు పడనివారైనా సరే సిగ్గు పడిపోతారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ‘ట్రాన్స్ పరెంట్ టాయ్ లెట్’ని చూస్తే మాత్రం ద్యావుడా..ఇటువంటి టాయ్ లెట్ ని ఎలా ఉపయోగిస్తాం..ఛీ పాడూ..సిగ్గు అంటూ మెలికలు తిరిగిపోతారు.



అటువంటి ‘ట్రాన్స్ పరెంట్ టాయ్ లెట్’ను టెక్నాలజీలో ఆరితేరిన జపనీయులు తయారు చేశారు. ఎందుకు ఈ ‘ట్రాన్స్ పరెంట్ టాయ్ లెట్’ అంటే…సరదాతోపాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేశామనీ కానీ మీ సిగ్గుకు మాత్రం సేఫ్టీ అంటున్నారు. మరి ఆ సరదాతోపాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేశామని అంటున్నారు.



ఈ టాయ్ లెట్లు పూర్తి పారదర్శకంగా కనిపిస్తాయి. లోపల ఏముందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కానీ లోపలికెళ్లాక జనం మనల్ని చూస్తే సిగ్గుచేటు కదా అని భయపట్టేట్టు ఉంటాయి. కానీ మనం ఒక్కసారి లోపలికెళ్లి గొళ్లెం పెట్టేసుకుంటే మొత్తం క్లోజ్. బయటి వారికి ఏమీ కనిపించదు. కానీ బ్లర్ అయినట్లు, మనుషులు ఉన్నట్లు మసగ్గా కనిపిస్తుంది తప్ప మన ముఖాలు, మనం ఏం చేస్తున్నామో అస్సలు కనిపించదు.



జపాన్ రాజధాని టోక్యోలోని షిబుయా ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు. షిగెరు బాన్ అనే కంపెనీ నిపుణులు వీటిని తయారు చేశారు. ఒకదాన్ని పురుషుల కోసం, మరోదాన్ని ఆడవాళ్ల కోసం, ఇంకోదాన్ని అందరూ వాడుకోడానికి ఉంచారు. టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయో లేదో బయటి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉండడంతో జనం ‘అర్జెంట్’ కాకపోయినా..అవసరం లేకపోయినా ఓసారి పోయొస్తే పోలా అని క్యూ కట్టేస్తున్నారు. సరదా తీర్చేసుకుంటున్నారు. దటీజ్ జపనీస్ అనిపిస్తున్నారు.