జూన్4న వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూస్తారు : కిషన్ రెడ్డి

దేశానికి ఏఏ పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రజలు ఆ ప్రాతిపదికనే ఓట్లు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

జూన్4న వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూస్తారు : కిషన్ రెడ్డి

Kishan Reddy

BJP Kishan Reddy : జూన్4న వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దేశ భవిష్యత్తుకోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవంకోసం ఓటు వేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణలో పోటీ చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి నేడు ఉన్నటువంటి సానుకూల వాతావరణం గతంలో ఎన్నడూ కనిపించలేదు. మహిళలు, యువకులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మా పార్టీకి ఆదరణ పెరుగోంది. ఓ సునామీ లాంటి అండర్ కరెంట్ క్షేత్ర స్థాయిలో కనబడుతోంది. జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఈ ప్రభంజనాన్ని చూస్తారని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : Kcr : నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అదో పనికిమాలిన స్కీమ్, ఆడోళ్లు తన్నుకుంటున్నారు- కేసీఆర్

దేశానికి ఏఏ పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రజలు ఆ ప్రాతిపదికనే ఓట్లు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి మోదీ ప్రధాని కాకముందు.. మోదీ ప్రధాని అయిన తరువాత దేశంలో వచ్చిన మార్పులపై ప్రజలు చర్చించాలి. పదేళ్లకు ముందు దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, అవినీతి కుంభకోణాలు రోజూ పేపర్లలో బ్యానర్లుగా ఉండేవి. రూ. 12లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు, కాగ్ రిపోర్టులే ఈ విషయాలను వెల్లడించాయని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : Cm Revanth Reddy : ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను దించేయాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

2014లో దేశంలో 32 ఏళ్ల తరువాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. 2019లో అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చి మోదీకి ప్రజలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, బంధుప్రీతిని బీజేపీ అధికారంలోకిఉన్న ఈ పదేళ్లలో సరిదిద్దామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాం. మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు. ఇవాళ దేశంలో మత కల్లోలాలు లేవు, ఐఎస్ఐ కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తున్నాం. దీని ఫలితాలు క్షేత్రస్థాయిలో కనబుడుతున్నాయి. దేశంలో శాంతి భద్రతలు నెలకున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్ ను ఏకాకిని చేశాం. తినడానికి తిండిలేని పరిస్థితికి పాకిస్థాన్ దిగజారిపోయిందని కిషన్ రెడ్డి అన్నారు.