ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ.. చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ.. చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

Land Titling Act

Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసత్య ప్రచారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా నారా లోకేశ్ లపై సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితోపాటు పది మందిపై కేసు నమోదు చేశారు.

Also Read : Posani Krishna Murali : అది నిరూపిస్తే.. చంద్రబాబు కాళ్లు కడిగి వెంటనే టీడీపీలో చేరతా- పోసాని కృష్ణమురళి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని,ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని వైసీపీ నేతలు శనివారం ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఈ అంశంపై విచారణ జరపాలని సీఐడీకీ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారు.. ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తున్నారో విచారణ చేయాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు శనివారం రాత్రి నుంచి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా.. ఐవీఆర్ఎస్ కాల్స్, యాక్ట్ పై దుష్ప్రచారం విషయంలో చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు మరో పది మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీలపైనా అధికారులు కేసు నమోదు చేశారు.