రాత్రి శ్మశానలోంచి ఏడుపు…గుంతలోంచి పసిగుడ్డును వెలికితీసిన స్థానికులు

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 09:22 AM IST
రాత్రి శ్మశానలోంచి ఏడుపు…గుంతలోంచి పసిగుడ్డును వెలికితీసిన స్థానికులు

ఏం జరిగిందో తెలీదు..చనిపోయిందని ఖననం చేశారో..లేదా బతి ఉందని తెలిసే వదిలించుకోవటానికి పాతి పెట్టారో తెలీదు గానీ..ఓ పసిగుడ్డును మట్టిలో పాతిపెట్టేశారు. చీమలు..పురుగులు కుట్టటంతో ఆ బిడ్డ గుక్కపట్టి ఏడ్చిన ఏడుపు విన్న ఓ మహిళ పరుగు పరుగున అక్కడికి వెళ్లగా మట్టిలో పైపైన పాతిపెట్టిన బిడ్డ కనిపించింది. వెంటనే మట్టిన పక్కకు తీసి బిడ్డను అక్కున చేర్చుకుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయటంతో ఝార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి శనివారం రాత్రి (ఆగస్టు 8,2020) వచ్చింది.



కుడు పోలీసు స్టేషన్ ప్రాంతంలోని చంద్లాసో గ్రామంలో శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఓ శ్మశానం నుంచి ఓ మహిళకు శిశువు ఏడుపు వినిపించింది. భయపడింది. ఎందుకంటే అది శ్మశానం. కానీ బిడ్డ ఏడుపు విని ఆగలేకపోతోంది. ఓపక్క భయం..మరో పక్క బిడ్డ ఏడుపు వినటంతో నాకెందుకులే అని ఊరుకోలేపోయింది. వెంటనే ఊరి ప్రజలకు తెలిపింది.



అక్కడికి వెళ్లిన ఆమె మట్టిలో కప్పెట్టిన ఆ బిడ్డ కనిపించింది. వారు వచ్చేంత వరకూ ఆగటానికి ఆమెకు మనస్సు అంగీరించలేదు. ఏడుపు వచ్చే ప్రాంతంలో మట్టిన పక్కకు తీసింది. అందులో ఓ పసిగుడ్డు కనిపించింది. మట్టిలో ఉండే చీమలు..పురుగులు కుట్టి..కుట్టి మట్టిలో ఉండే తడికి చలితో వణికిపోతున్న ఆ బిడ్డను గబగబా వెలికి తీసి అక్కున చేర్చుకుంది. ఆ బిడ్డకు బొడ్డు తాడు కూడా తీయకుండా అలాగే ఉంది.



ఇదంతా జరుగుతుండగానే ఊరి ప్రజలు అక్కడికి ఆ పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని ఆనందపడ్డారు. ఆఊరిలోనే ఉన్న ఓ చంటిబిడ్డ తల్లికిచ్చి పాలు పట్టించారు. ఈ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలువురు దత్తత తీసుకోవటానికి గ్రామస్థలు పోటీ పడ్డారు. ఈలోగా దీనిపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. శిశువును స్వాధీనం చేసుకుని రాంచీలోని రాణి చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆ బిడ్డ ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? బతికి ఉండగానే పాతిపెట్టారా? లేదా చనిపోయిందనుకుని పాతి పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.