కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ పోస్టు చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు..

  • Published By: nagamani ,Published On : August 17, 2020 / 10:13 AM IST
కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ పోస్టు చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ఆగస్టు 15 రోజున భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సం శుభాకాంక్షలతో పాటు భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లేని భారతదేశపు మ్యాప్ ను పోస్ట్ చేశారు కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శానిమోల్ ఉస్మాన్. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దశాబ్ధాల కాలంగా భారత్ – పాకిస్తాన్ మధ్య కశ్మీర్ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భారత భూ భాగం అయినప్పటికీ దాన్ని పాక్ ఆక్రమించుకునేందుకు అన్ని రకాల కుయుక్తులు పన్నుతోంది.



ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద పోస్టు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారు. జమ్మూ కశ్మీర్ లేని భారత మ్యాప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సిపిఐ (ఎం) అరూర్ యూనిట్ ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కశ్మీర్ లేని భారత్ మ్యాప్ ను అలా పోస్ట్ చేయటం రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లని సీపీఎం ఓ ప్రకటనలో తెలిపింది.



అరూర్‌ ఎమ్మెల్యే శానిమోల్‌ ఒస్మాన్‌ ఈ మ్యాప్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఆమె భారత మ్యాప్ కూడా పెట్టారు. అయితే అందులో జమ్మూ కశ్మీర్ ప్రాంతం లేదు. దీన్ని గుర్తించిన సీపీఎం నేతలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే తాను ఈ విషయాన్ని గుర్తించలేదని శానిమోల్‌ ఒస్మాన్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు తానేనని క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు.