కోడెల కన్నుమూత: పల్నాడులో హై అలర్ట్

కోడెల కన్నుమూత: పల్నాడులో హై అలర్ట్

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మృతితో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన పోలీసులు అక్కడ హై అలర్డ్ ప్రకటించారు. 

రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తిగా పల్నాడు డేరింగ్ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల ఫ్యాక్షన్ నేతగా ఎదగడమే కాక, పదవీ కాలంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. కొద్ది నెలలుగా ఫర్నిచర్, అక్రమాస్తులు, పన్నుల విషయంలో మోసాలకు పాల్పడ్డారంటూ కోడెలపై వస్తున్న ఆరోపణలతో కుంగిపోయారు.