రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదు : రాపోలు రిజైన్

  • Published By: madhu ,Published On : March 22, 2019 / 08:48 AM IST
రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదు : రాపోలు రిజైన్

రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌కి మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను పంపారు. తెలంగాణ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా నేతలు ‘చేయి’ జారిపోతున్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన వారు, మాజీ నేతలు రిజైన్ చేస్తూ ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం వెల్లడించలేదు. TRSలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 
Read Also : పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా

రాపోలు ఆనంద్ భాస్కర్ 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ నేత పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వారు. గతంలో చేనేత రంగంలో జరిగిన ఉద్యమాల్లో రాపోలు పాల్గొన్నారు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీపీసీసీ అనుసరిస్తున్న విధానాలు నచ్చడం లేదని…అసెంబ్లీ ఎన్నికలు..సమీపంలో ఎన్నికలు ఉన్నా తనను పట్టించుకోవడం లేదని రాపోలు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాపోలు పార్టీకి గుడ్ బై చెప్పారు.
Read Also : ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల – బాలినేని వర్గాల ఘర్షణ