కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు రాజయ్యాడు

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 09:09 AM IST
కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతు రాజయ్యాడు

జహీరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ జహీరాబాద్ లో  పార్లమెంట్ నిజయోజక వర్గ సన్నాహక సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సులోపాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు..కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రం దేశానికే దిక్చూచిగా మారిందన్నారు. రైతుబిడ్డ కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు గల్లా ఎగరేసే స్థాయికి చేరుకున్నారనీ..ఆయన వల్లనే రైతులకు ఉచిత విద్యుత్ వచ్చిందన్నారు. కేసీఆర్ వల్లనే  తాము పంటలు పండించుకుంటు రైతు రాజయ్యాడని..కేటీఆర్ అన్నారు. అంతటి ఘనత సాధించించి కేసీఆర్ ఒక్కరేనన్నారు. 

కేసీఆర్ కూడా రైతే కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకుని రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.కేసీఆర్ గారి పూర్వీకుల భూమి అప్పర్ మానేరు ప్రాజెక్టులో పోయిందనీ..అందుకే ఆయనకు భూమి బాధలు తెలుసన్నారు..అందుకే ప్రాజెక్టులకు రైతుల భూములు తీసుకున్నా తగిన నష్టపరిహారాలను చెల్లిస్తున్నారనీ..రాష్ట్రానికి జీవనాడిగా రూపు దిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను బంగారు తెలంగాణగా  తీర్చి దిద్దేందుకు సంకల్పించారన్నారు.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు పూర్వ వైభవం తెచ్చి ఆ ఆయకట్టు రైతులకు నీరందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల కోసం కేసీఆర్ బ్రహ్మాండమైన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గతంలో పాలకుల వల్ల రైతులు నానా కష్టాలు అనుభవించారని.. ఉచిత విద్యుత్ అని ప్రకటించిన గత ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నాయనే బాద ఒకవైపు..బోర్లు వేసి నీరు పెట్టుకునేందుకు రాత్రి సమయంలో పొలాలకు వెళ్లి విద్యుత్ షాకులకు బలైయి..పాములు కరిచి చనిపోయిన   రైతుల మరణాలకు కారకులయ్యారని విమర్శించారు. కానీ కేసీఆర్ రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.8 వేలు ఇస్తు పెట్టుబడులకు సాయపడుతున్నారని ఈ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాబోయే సీజన్ నుంచి ఎకరానికి రూ.10వేలు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రైతు పక్షపాతిగా ప్రభుత్వం భూ రికార్డులను ప్రక్షాళన చేసిందన్నారు. 

ఆడబిడ్డలకు ఆపద్భాంధవుడిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనీ..మనస్సున్న నాయకుడు కాబట్టే ఒంటరి మహిళలకు పెన్షన్లు..బాలింతలకు కేసీఆర్ కిట్లు..ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి..సాదీ ముబారక్ పేరుతో  పథకాలను అమలు చేసిన ఘతన కేసీఆర్ దేనన్నారు. 
Read Also : ఇది కన్ఫామ్ : మంగళగిరి నుంచే లోకేష్ పోటీ