నిద్రపోతున్న యువకుడి ప్యాంటులో దూరిన పాము..! రాత్రంతా నరకం..

  • Edited By: nagamani , July 29, 2020 / 04:37 PM IST
నిద్రపోతున్న యువకుడి ప్యాంటులో దూరిన పాము..! రాత్రంతా నరకం..

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో నిద్రపోతున్న ఓ యువకుడి ప్యాంటులో పాము దూరింది. దీంతో అతని పాట్లు పగవాడికి కూడా వద్దురా బాబూ అన్నట్లుగా అయిపోయింది పాపం ఆ యువకుడి పరిస్థితి. కదిలితే లోపల దూరిని పాము ఎక్కడ కాటేస్తుందోననే భయంతో పాపం అతను రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుంటూ అలాగే కదలకుండా నిలబడి ఉన్నాడు.పాములు పట్టే వ్యక్తి వచ్చి చాకచక్యంగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత అతను తాను గడిపిన రాత్రిని గుర్తు చేసుకొని ఆ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికీ నా గుండె నా స్వాధీనంలో లేదు..దడ దడలాడిపోతోందంటూ వాపోయాడు పాపం..మీర్జాపూర్ జిల్లాలోని అహ్రౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్పూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు మరమ్మత్తులు చేపట్టారు విద్యుత్ సిబ్బంది. ఆ గ్రామంలోని లవ్లేష్ అనే యువకుడు కూడా విద్యుత్ పనులు చేస్తూ తోటి కార్మికులతో అంగన్‌వాడీ కేంద్రంలో నిద్రపోయాడు. పగలంతా పని చేసిన అతను ఆదమరచి నిద్రపోయాడు. ఇంతలో ఓ పాము అతడి ఫ్యాంటులో దూరింది. వెంటనే అతడు ఏదో దూరిందని గమనించి పైకిలేచి చూశాడు. ప్యాంటు చివర పాము కనిపించడంతో భయంతో ఎటూ కదలకుండా ఓ స్థంబాన్ని ఆసరాగా చేసుకొని రాత్రంతా నిలబడే ఉన్నాడు.ఈ విషయం తెలిసి ఉద‌యం‌ స్థానికులు పాములు పట్టే వ్యక్తిని పిలిచారు. ఎందుకైనా మంచిదని గ్రామస్తులు తోటి సిబ్బంది ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అంబులెన్స్‌ను కూడా ఫోన్ చేసిన అప్రమత్తంగా ఉన్నారు. పాములు పట్టేవాళ్లు వచ్చిన తరువాత చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఆ పాము అతన్ని కాటు వేయకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అది విషపూరితమైన పాము అని ఆ యువకుడు అదృష్టమే అతని ప్రాణాలు కాపాడిందని పాములు పట్టేవారు చెప్పారు.