కర్నూలులో నీటి యుద్ధం : వైసీపీ కార్యకర్తలు, స్థానికుల మధ్య ఘర్షణ

కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 05:42 AM IST
కర్నూలులో నీటి యుద్ధం : వైసీపీ కార్యకర్తలు, స్థానికుల మధ్య ఘర్షణ

కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు

కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు కొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

కాల్వబుగ్గలోని కాలనీలో మంచి నీటి బోరు మోటర్ కాలిపోయింది. దీంతో తాగు నీటి సమస్య ఏర్పడింది. తాగు నీరు సరఫరా ఆగిపోయి 4 రోజులుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు బాగు చేయాలని కాలనీ వాసులు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో తామే బోరు చేయించుకోవాలని నిర్ణయించారు. అయితే స్థానిక వైసీపీ నేత ఒకరు దీనికి అడ్డుపడ్డాడు. పర్మిషన్ లేకుండా బోరు ఎలా బాగు చేయిస్తారని అడ్డగించాడు. దీంతో కాలనీ వాసులు, వైసీపీ నేత మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకున్నాయి.

4 రోజులైనా అధికారులు సమస్యని పరిష్కరించకపోవడం వల్లే ఈ ఘర్షణ జరిగిందని కాలనీవాసులు వాపోయారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.

తాగునీరు సరఫరా చేయమన్నందుకే వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాలనీ వాసులు వాపోయారు. బోర్ స్టాటర్ కాలిపోవడంతో 4 రోజులగా నీరు సరఫరా కావడం లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టాటర్‌ బిగించేందుకు తాము ప్రయత్నించగా.. తమ అనుమతి లేకుండా ఎలా బిగిస్తారని వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేవారు.