ఏపీలో వాటర్ షెడ్ ప్రాజెక్టు : ప్రపంచ బ్యాంక్ రుణం

ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది. 

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 01:46 PM IST
ఏపీలో వాటర్ షెడ్ ప్రాజెక్టు : ప్రపంచ బ్యాంక్ రుణం

ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది. 

ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో కర్ణాటక, ఒడిషాలతో వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉన్న ప్రపంచ బ్యాంక్ తాజాగా ఆంధ్రప్రదేశ్ తో కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది. 

రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాలో తొలి దశలో వాటర్ షెడ్ పథకం అమలు చేయనున్నారు. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ను ఎంపిక చేసింది. ఐదేళ్లపాటు రాష్ట్రంలో 70 మిలియన్ డాలర్ల(సుమారు రూ.500 కోట్లు) రుణం అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 

ఈ మేరకు బుధవారం(నవంబర్ 27, 2019) అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో కూడిన బృందం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సమావేశం అయ్యింది. ప్రపంచ బ్యాంక్ రుణంతో రాష్ట్రంలో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో 70 శాతం ప్రపంచబ్యాంక్‌, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్ షెడ్ అమలుకు ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయ శాఖలు, ఎపి స్పేస్ అప్లికబుల్ సెంటర్, వ్యవసాయ యూనివర్సిటీల కన్సార్టియం ద్వారా పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు.

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జలవనరులను సంరక్షించడం లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆధునిక నీటి యాజమాన్య విధానాల ద్వారా నీటి వనరుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీ శాట్ ద్వారా భూసార పరీక్షలు..రైతులకు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.