మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బ్యాంకుల ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మధ్య అనుబంధం ఏంటి? ఈ ప్రశ్న నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి ట్వీట్‌‌ను బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న  విజయ్ మాల్యా రీ ట్వీట్ చేయడంతో వీరి మధ్య అనుబంధం ఏమిటి? అని చర్చకు వస్తుంది. సోషల్ మీడియాలో మాగుంట జగన్‌తో కలిసి దిగిన ఫోటో ట్వీట్‌ను రీట్వీట్ చేయడం.. ఈ ట్వీట్ నెటిజన్‌ల కంటపడడంతో ట్రోలింగ్ మొదలై పోయింది. విజయ్ మాల్యా రీట్వీట్‌ను ఉద్దేశిస్తూ వైసీపీకి వ్యతిరేకగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ట్రోలింగ్ చేస్తున్నారు. 
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాల్యా కుటుంబాలకు మధ్య చిరకాల స్నేహం ఉంది. ఒంగోలు నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి సోదరుడు మాగుంట సుబ్బిరామి రెడ్డి లిక్కర్ వ్యాపారంలో విజయ్ మాల్యాకు పార్ట్‌నర్లుగా ఉన్నారు. దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డికి, మాల్యాకు మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ తరుపున ఎంపీగా పనిచేసిన సుబ్బిరామి రెడ్డి నక్సలైట్ల చేతిలో చనిపోయారు. అయితే వారి కుటుంబాల మధ్య అనుబంధం మాత్రం ఇప్పటికీ ఉందని మాల్యా రీట్వీట్ ద్వారా అర్థం అవుతుంది.

Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

×