షాకింగ్ న్యూస్ : మరో సంవత్సరం కరోనా కష్టాలు తప్పవు : WHO కీలక వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : July 25, 2020 / 03:18 PM IST
షాకింగ్ న్యూస్ : మరో సంవత్సరం కరోనా కష్టాలు తప్పవు : WHO కీలక వ్యాఖ్యలు

యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతోంది. మహమ్మారిని కట్టడిచేసేందుకు మందులను కూడా తయారు చేసి ప్రయోగాలు కూడా చేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా వ్యాక్సిన అందుబాటులోకి వస్తుందంటూన్నారు.అయినా కానీ కరోనా కష్టాలు ఇంకో సంవత్సరం పాటు తప్పదని బాంబు పేలుస్తూ.. WHO కీలక వ్యాఖ్యలు చేసింది.

కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నమైపోయింది. భారీ భారీ కంపెనీల్నీ మూత పడిపోయాయి. విద్యావ్యవస్థ తల్లక్రిందులైపోయింది. యావత్ ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులపై కోలుకోలేని దెబ్బకొట్టింది కరోనా. ప్రజలు ఉన్న ఉపాధి పోయి..ఉద్యోగాలు పోయి మరోవైపు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయం గుప్పిట్లో బతుకున్న క్రమంలో మరో ఏడాది పాటు మహమ్మారితో పోరాటం తప్పేలా లేదని ఆ సంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథ్ వెల్లడించిన విషయాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ కీలక విషయయాన్ని వెల్లడించారు. మరో ఏడాది పాటు ఈ తిప్పలు తప్పవని స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు క్లీనికల్ ట్రయల్స్ పూర్తి చేసే స్థాయికి వచ్చాయని..2020 చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కోట్లాది మందికి పంపిణీ చేయాల్సిన టీకాలు రావాలంటే సమయం పడుతుందని..చెప్పిన ఆమె.. ఈ లెక్కన చూస్తే మరో ఏడాది పాటు కరోనాతో యుద్ధం చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

మరోవైపు మంద రోగ నిరోధక శక్తి ( హెర్డ్ ఇమ్యూనిటి ) పై కూడా ఆమె మాట్లాడుతూ.. రోగ నిరోధక శక్తి సహజంగా వ్యాపించాలంటే వైరస్ చాలా సార్లు సమాజంపై తీవ్రప్రభావం చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్ప‌టికే అన్ని రంగాల‌ను దెబ్బ‌కొట్టిన క‌రోనా వైర‌స్‌.. మ‌రో ఏడాది పాటు ఇలాగే ఉంటుందని తెలిసి ఆ ప‌రిస్థితి ఊహిస్తే ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పరిస్థితి.