టీడీపీ దొంగ ఓట్లు తొలగించండి : ఈసీకి జగన్ కంప్లయింట్

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 07:10 AM IST
టీడీపీ దొంగ ఓట్లు తొలగించండి : ఈసీకి జగన్ కంప్లయింట్

ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్‌కి కొమ్ము కాస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటే..ఈసీ చర్యలు తీసుకోవాలని…ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు ఉన్నతాధికారులను పక్కకు తప్పించాలని జగన్ కోరారు. 

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు జగన్ ఢిల్లీకి వచ్చారు. ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం సీఈసీ అధికారి సునీల్ అరోరాను కలిశారు. భేటీ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని…ఓటర్లను అక్రమమార్గంలో చేరిపించడం…తమ పార్టీకి చెందిన సానుభూతి పరుల ఓట్లను తొలగించారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించడం జరిగిందన్నారు. 

సీఎం చంద్రబాబు ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో 59 లక్షల 18 వేల ఓట్లు నమోదు చేశారని…ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను రకరకాల సర్వేల రూపంలో కనుక్కొని తొలగించారని తెలిపారు. ప్రజాసాధికారిత సర్వే, పరిష్కార వేదిక..పీరియాడిక్ సర్వే..ఇలా సర్వేల పేరిట ఓట్లను తీసివేస్తున్నారన్నారు. 

పోలీసు ఉన్నతాధికారులపై జగన్ పలు ఆరోపణలు గుప్పించారు. ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బాబు సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు, సీఐలకు ప్రమోషన్ ఇస్తున్నారని ఆరోపించిన జగన్…37 మంది ఉంటే 35 మంది ఒకే సామాజికవర్గానికి చెందిన వారన్నారు. దీనికి సంబంధించిన లిస్టును మీడియాకు చూపించారు. లా అండ్ ఆర్డర్‌‌లో…లా అండ్ కోర్డినేషన్ ఒక పోస్టును క్రియేట్ చేసిన బాబు…డీఐజీగా అదే సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌ని నియమించారని మీడియాకు తెలిపారు.  బాబు ఆధ్వర్యంలో డీఐజీగా ఉన్న ఠాకూర్ ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని, ఇటీవలే తనపై జరిగిన హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. సో..వీరందరినీ పక్కకు తప్పిస్తే..తప్ప ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా..శాంతియుతంగా జరగవని సీఈసీ అరోరాకు తెలుపడం జరిగిందన్నారు జగన్. మరి జగన్ విజ్ఞప్తులతో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి.