Viral Video: బుడ్డోడు భలే పనిమంతుడు.. క్యాన్లు మోస్తూ తల్లికి అండగా చిన్నారి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ..

ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతా ద్వారా నిత్యం ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు శీర్షికగా.. వయస్సు, ఎత్తు తక్కువగా ఉండవచ్చు, కానీ "సహాయ భావన" చాలా ఎక్కువ. తల్లిదండ్రులు ప్రత్యేకమైన వజ్రాన్ని చెక్కారు అంటూ రాశారు.

Viral Video: బుడ్డోడు భలే పనిమంతుడు.. క్యాన్లు మోస్తూ తల్లికి అండగా చిన్నారి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ..

little boy Help

Viral Video: చిన్న పిల్లలు చేసే అల్లరి చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. కొందరు చిన్నారులు చేసే విచిత్రమైన పనులు నవ్వులు తెప్పిస్తాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటూ నెటిజన్ల ప్రశంసలు పొందుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారి తల్లికి సాయంగా వాటర్ క్యాన్లు మోస్తూ హల్ చల్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘బుడ్డోడు భలే పనిమంతుడు’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా స్టార్ అయిన మరో పాక్ అమ్మాయి 

ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతా ద్వారా నిత్యం ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా వారు ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు శీర్షికగా.. వయస్సు, ఎత్తు తక్కువగా ఉండవచ్చు, కానీ “సహాయ భావన” చాలా ఎక్కువ. తల్లిదండ్రులు ప్రత్యేకమైన వజ్రాన్ని చెక్కారు అంటూ రాశారు. ఈ వీడియోలో ఖాళీ వాటర్ క్యాన్లతో కూడిన ఓ పెద్ద వాహనం ఇంటి ముందు ఆగుతుంది. దానిలో వాటర్ క్యాన్లను తన తల్లి తీసుకొచ్చి రూంలో భద్రపరుస్తుంది. దీనిని గమనించిన బుడ్డోడు తల్లికి సాయం చేసేందుకు సిద్ధమై ఒక్కో క్యాన్ ను తెచ్చి రూంలో ఉంచుతాడు. అలా దాదాపు రెండుమూడు క్యాన్ల వరకు అడుగులో అడుగు వేసుకుంటూ తెచ్చి రూంలో భద్రపరుస్తాడు. ఈ వీడియోలో చిన్నారి నడక, పరుగు, చలాకీతనం నెటిజన్లను కట్టిపడేస్తోంది.

 

ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 4వేల మంది వీక్షించారు. చిన్నారి చిలిపితనంతోచేసే పని నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో చిన్నారిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ వినియోగదారుడు ‘ కోహినూర్’ అంటూ వ్యాఖ్యానించగా, మరికొరు ఆహ్.. ఇది చాలా ఆరోగ్యకరమైనది అంటూ పేర్కొన్నాడు. మరికొరు. ఈ చిన్నారి పనిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ మరో నెటిజన్లు పేర్కొన్నాడు. ఇలా పలువురు నెటిజన్లు తమదైన శైలిలో చిన్నారిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.