Viral Video: ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా స్టార్ అయిన మరో పాక్ అమ్మాయి 

ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ మరో పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఇప్పటికే పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయేషా.. లతా మంగేష్కర్ పాడిన ‘మేరా దిల్ యే పుకారే ఆజా’కు డ్యాన్స్ చేయడంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

Viral Video: ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా స్టార్ అయిన మరో పాక్ అమ్మాయి 

Viral Video

Viral Video: ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ మరో పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఇప్పటికే పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయేషా.. లతా మంగేష్కర్ పాడిన ‘మేరా దిల్ యే పుకారే ఆజా’కు డ్యాన్స్ చేయడంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

అనంతరం కూడా పలు పాటలకు డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు భారీగా పెంచుకుంది. ఇప్పుడు ఆయేషా బాటలోనే మరో పాకిస్థాన్ అమ్మాయి భారతీయ సినిమా పాటకు డ్యాన్స్ చేసింది. నిజానికి ఆ అమ్మాయి చాలా రోజుల క్రితమే ఈ డ్యాన్సు చేసినప్పటికీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఆమెను స్టార్ ను చేస్తుండడం గమనార్హం.

సల్మాన్ ఖాన్ పాపులర్ సాంగ్ చున్నారీ చున్నారీ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయి వివరాలు తెలియరాలేదు. అయితే, ఈ వీడియోను ఇప్పటికే 1.7 కోట్ల మంది చూశారు. లైబీబేబీ యూట్యూబ్ చానెల్ లో ఈ క్లిప్ పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి చేసిన డ్యాన్సుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అచ్చం బాలీవుడ్ హీరోయిన్ లా చేసిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Mallikarjun Kharge: అదానీ వ్యవహారంలో మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: ఖర్గే