నడవలేని భార్య కోసం: వీల్ చైర్ ని ‘రిగ్’ బైకులా మార్చేశాడు..

  • Published By: nagamani ,Published On : September 15, 2020 / 04:40 PM IST
నడవలేని భార్య కోసం: వీల్ చైర్ ని ‘రిగ్’ బైకులా మార్చేశాడు..

ప్రకృతి అంటే ప్రాణం పెట్టే భార్య నడవలేని స్థితిలో పడిపోవటం చూసిన ఓ భర్త గుండె అల్లాడిపోయింది. పచ్చని చెట్లు..జలజలాపారే జలపాతాలు..కిలకిలలాడే పక్షులు అంటే ప్రాణం ఆమెకు..కానీ నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌కే పరిమితమైన తన భార్యను చూసిన ఆ భర్త గుండె బరువెక్కింది. ఉరుగుల పరుగుల జలపాతంలా ఎగసిపడే తన భార్య అలా వీల్ చైర్ కే పరిమితం కావటం అతనికి నచ్చలేదు. దీంతో ఆమె కోసం ఎలాగైనా సరే ఆమె కోసం ఏదన్నా చేయాలనుకున్నాడు. ఆలోచించాడు. ఆలోచించాడు. అతని ఆలోచనలు ఫలించాయి. ఓ చక్కటి ఐడియా వచ్చింది.అంతే ఆమె ఇప్పు కొండలు..గుట్టలు..ఇసుక నేలలల్లో కూడా దూసుకుపోతోంది..పర్వతాలు కూడా ఎక్కేస్తోంది. ఇంతకీ ఆ భర్త ఏం చేశాడంటే..ఆమె వీల్ చైర్ ని ఓ బైక్ లా మార్చేశాడు. అది అలాంటిలాంటి బైక్ కాదు. పర్వతాలు, మంచు, రాళ్లు, ఇసుకలో సైతం సులభంగా నడిచే ‘రిగ్’.


ఆ బర్త పేరు జాక్ నేల్సన్. ప్రఖ్యాత యూట్యూబ్ స్టార్. అతని భార్య పేరు క్యాంబ్రీ. ఆమెకు ప్రకృతే కాదు గుర్రపు స్వారీ అంట ప్రాణం. గుర్రం ఎక్కిందంటే గాల్లో దూసుకుపోవాల్సిందే. అలా గుర్రపు స్వారీ చేస్తున్న క్యాంబ్రీ 2005లో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో క్యాంబ్రీ నడుము కింది భాగం పనిచేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె నడవలేకపోయింది. వీల్‌ఛైర్‌కే పరిమితమైపోయింది. అడ్వాంచెర్లంటే ఆమెకు ఎంతో ఇష్టం.కానీ నాలుగు చక్రాల కుర్చీకే ఆమె అలా ఉండిపోవటం జాక్ కు నచ్చలేదు.



https://10tv.in/hatsoff-west-godavari-farmers-bulit-hanging-bridge-on-their-own/
ఆమె తపన ఏంటో..ఆమె వేగం ఏంటో జాక్ కు బాగా తెలుసు. చురుకుతనం..ఉత్సాహం..జలపాతంలో ఉరికిపడే ఆమె వేగం ఆగిపోవటం ఆతనికి ఏమాత్రం నచ్చలేదు. కానీ ఆమె కోసం ఏదో చేయాలనే తపనే గానీ ఏం చేయాలని నిరంతరం ఆలోచించేవాడు జాక్. అలా 2018లో జాక్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆమె కోసం ఓ ఎలక్ట్రిక్ బైక్ రెడీ చేయాలనుకున్నాడు.


అనుకున్నట్లే.. జాక్ ఆమె కోసం ఆ బైక్‌ను సిద్ధం చేశాడు. మధ్యలో సీటు, చేతిలో సులభం ఇమిడిపోయే హ్యాండిల్స్‌తో ఎలక్ట్రిక్ బైక్‌ను రెడీ చేశాడు. దానికి ‘రిగ్’ అని పేరు పెట్టాడు. ఇప్పుడు క్యాంబ్రీ ఆ బైక్‌పైనే ఎంజాయ్ చేస్తోంది. ఎవరి అవసరం లేకుండానే ఎక్కడికెళ్లాలన్నా వెళుతోంది. షికారుకెళ్తోంది. మార్కెట్ కు వెళ్లి ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తోంది. సమీపంలోని ప్రాంతాలకు చక్కగా వెళ్లి చూసి వస్తోంది.బీచ్ లో కూడా చక్కగా షికార్లు కొడుతోంది.


తన భార్య ‘స్పీడ్’ గురించి తెలిసిన జాక్.. ఆమె సేఫ్టీ కోసం బైక్ వేగాన్ని గంటకు 20 కిమీలకు కుదించాడు. దీన్ని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే సుమారు 15 నుంచి 34 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ బైక్ ఇప్పుడు జాక్ భార్యకు మాత్రమే కాదు.. ఆమెలా నడవలేని స్థితిలో ఉన్న ఎంతో మందికి చాలా చాలా ఉపయోగకరంగా మారింది. దీంతో జాక్ అటువంటి బైకులను తయారు చేసి అతి తక్కువ ధరకే నడవలేని వారి కోసం అందిస్తున్నాడు. తన కోసం తనలాంటివారి కోసం భర్త చేస్తున్న పనికి క్యాంబ్రీ చాలా చాలా సంతోషపడిపోతోంది.