130 ఏళ్లలో తొలిసారి కనిపించిన అరుదైన మంచు గుడ్లగూబ

130 ఏళ్లలో తొలిసారి కనిపించిన అరుదైన మంచు గుడ్లగూబ

New York : rare snowy owl  in central park 1st time in 130 yrs : న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ జూలో ఓ అరుదైన మంచు గుడ్లగూడ కనిపించి కనువిందు చేసింది. గత శతాబ్ద కాలంలో మొదటిసారి కనిపించిన ఈ మంచు గుడ్లగూబను చూసి జూ అధికారులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. సెంట్రల్ పార్క్ జూలో కనపించిన ఈ మంచు గుడ్లగూడ కనిపించి సందడి చేసింది. దాన్ని చూసి సందర్శకులు మురిసిపోయారు.

న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ జూలో గత 130 సంవత్సరాలలో ఈ గుడ్లగూబ కనిపించడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. జూలో అరుదైన గుడ్లగూడ కనిపించిదనే విషయం తెలిసిన పక్షిప్రేమికులు, వ్యన్యప్రాణి ఔత్సాహికులు జూకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాన్ని చూసి మహదానందం పొందారు. సెంట్రల్ పార్క్‌లో ఈ మంచు గుడ్లగూబ చివరిసారి 1890లో కనిపించిందని అమెరికాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షిశాస్త్ర విభాగ కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు.

సెంట్రల్ పార్క్‌లో కనిపించిన ఈ పక్షి సోషల్ మీడియాలో చేసిన హల్‌చల్ చేస్తోంది. దీని సందడి చూసినవారంతా ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలే సోషల్ మీడియాలో ఈ మంచు గుడ్లగూబ సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో చూసిన చాలామంది ఔత్సాహికులు సెంట్రల్ పార్క్‌కు తండోపతండాలు తరలివచ్చి దాన్ని చూసి మురిసిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే.. తెల్ల గుడ్లగూబ ఇతర పక్షులతోనూ చక్కగా కలిసిపోతూ తెగ సందడి సందడి చేస్తోంది..

 

నిజానికి ఈ మంచు గుడ్లగూబలు అర్కిటిక్‌ టండ్రా ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. శీతాకాలంలో దక్షిణం వైపుగా పయనిస్తాయి. లాంగ్ ఐలండ్, అక్కడి బీచ్‌లలో ఇవి తరచూ దర్శనమిస్తుంటాయి. మంచు గుడ్లగూబను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అప్రమత్తమైన సెంట్రల్ పార్క్ అధికారులు దూరం నుంచే దానిని గమనించాలని, పక్షిని భయపెట్టవద్దని సూచించారు.

మంచు గుడ్లగూబలు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటాయని, వాటిని బైనాక్యులర్లలో చూడడమే మేలని న్యూయార్క్ సిటీ పార్క్స్ అండ్ రిక్రియేషన్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది.