గడ్డకట్టే చలి నుంచి…ఈ కుక్క సేఫ్

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 04:53 AM IST
గడ్డకట్టే చలి నుంచి…ఈ కుక్క సేఫ్

దేశ రాజధాని అయిన ఢిల్లీలో చలి తీవ్రత రోజు రోజూకి ఎక్కువైపోతుంది. ఆ చలికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి మనుషులు, పులులు కాక మూగజీవులు వణికిపోతున్నాయి. ఆ మూగ జీవుల బాధను అర్ధం చేసుకోన్న ఒక మనిషి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాయత్ అనే వ్యక్తి ఫోటో తీసి ట్విటర్ లో  షేర్ చేశాడు.

ఒక రిక్షా నడిపే వ్యక్తి కుక్కకు దుప్పటితో చుట్టి తన రిక్షాలో కూర్చో పెట్టుకొని తీసుకు వెళ్తున్నట్టు ఫోటోలో కనిపిస్తుంది. జంతు ప్రేమికుడైన డాక్టర్ విభూతి గుప్తా గురువారం(జనవరి 2,2020) ఉదయం తాను పనికి వెళ్తున్నప్పుడు ఆ విచిత్రం చూసి ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని తెలిపారు.

మౌలానా ఆజాద్ రోడ్ లో హోలీ ఆస్పత్రి వద్ద రిక్షా పుల్లర్ ప్రతిరోజు కుక్కను తన రిక్షాలో కూర్చో పెట్టుకొని తీసుకువెళ్తాతాడు అని తెలిపారు. ఈ విధంగా కుక్కకు వేడిని కలిగించినందుకు తనకు ఆనందంగా ఉన్నది అన్నారు. త్వరలో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని థ్యాంక్స్ చెప్తా అని చెప్పారు.