ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని

 రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.

ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని

 రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.

 రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు. టోల్ గేట్ దగ్గర కారు ఆపితే పలు సందర్భాల్లో టోల్ సిబ్బందిపై రాజకీయనాయకులు భౌతికదాడులకు దిగడం మనం చూశాం. అయితే ఇదే సమయంలో మీరు కూడా మాలాంటివాళ్లే అందరిలానే క్యూలో రండి అంటూ కర్ణాటక హోం మంత్రినే ఓ యువతి ప్రశ్నించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

సోమవారం (మార్చి-4,2019) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవుడిని దర్శించుకునేందుకు విజయాపురలోని శివాలయానికి కర్ణాటక హోంమంత్రి ఎంబి పాటిల్ వెళ్లారు. అప్పటికే దేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూలైన్ లో నిలబడి ఉన్నారు. ఆలయ అధికారులు మంత్రిగారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో క్యూలో నిలబడకుండానే మంత్రిగారు దర్శనం కోసం గుడిలోకి వెళ్తున్న సమయంలో క్యూలో నిలబడి ఉన్న ఓ విద్యార్థిని మంత్రిగారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాము కొన్ని గంటలుగా దర్శనం కోసం క్యూలో నిలబడ్డామని,  అందరిలానే మంత్రి కూడా క్యూలో రావాలని ఆ యువతి డిమాండ్ చేసింది. దీంతో స్పందించిన మంత్రి పాటిల్..ముఖ్యమైన అధికారిక సమావేశాల్లో తాను పాల్గొనాల్సి ఉందని, అత్యవసరంగా హుబ్లీకి వెళ్లి అక్కడి నుంచి విమానంలో బెంగళూరు వెళ్లాల్సి ఉందని తన పరిస్థితిని ఆయువతికి వివరించాడు.

ఆ యువతితో కలిసి ఫొటో కూడా దిగాడు. చివరకు ఆ యువతి శాంతించడంతో దర్శనం చేసుకుని మంత్రి వెళ్లిపోయారు. అక్కడున్న పలువురు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. మంత్రి అయితేనేం అంటూ ప్రశ్నించిన ఆ యువతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read : చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు