తెలంగాణ

వాషింగ్టన్: అమెరికాలో తానా 20వ మహాసభలు అట్టహాసంగా సాగుతున్నాయి. డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరుగుతున్న తానా మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. తెలుగు సినిమా హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు అదరగొట్టె స్టెప్పులతో ఆహుతులను అలరించారు.

హైదరాబాద్: బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ టీడీపీ లీడర్లు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వరంగల్: విద్యుత్‌ హై ఓల్టేజీ రెండువందల ఇళ్లల్లో భారీ నష్టం మిగిల్చింది. వరంగల్‌ జిల్లా హన్మకొండ రెడ్డి కాలనీలోని రెండువందల ఇళ్లల్లో విద్యుత్‌ హై ఓల్టేజీ కారణంగా కలర్‌ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్స్‌ లాంటి ఎలక్ట్రానిక్ గృహోపకరాణాలు షార్ట్ సర్క్యూట్‌ అయ్యాయి.

నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శూన్యపహాడ్‌లో రామాచారి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఉదయం పూట రామాచారి ఇంటికి వచ్చిన దుండగులు తలుపులు బాదారు.

ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కమాన్ బజార్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గార్లపాటి మెటల్ స్టోర్స్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టోర్ పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఎక్కువ ప్లాస్టిక్ సామాగ్రి ఉండటంతో... మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులోని వస్తువులన్నీ కాలిపోయాయి.

హైదరాబాద్: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 64 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాచారం మానిక్‌ చంద్‌ వద్ద ఓ గోదాములో ఎల్‌ బీ నగర్‌, సరూర్ నగర్‌లకు చెందిన పలువురు రేషన్‌ డీలర్లు బియ్యాన్ని తరలించి..

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్డులో గోపాలపురం పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బైక్‌ రేసింగ్‌ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అతివేగంతో బైకులు నడుపుతూ...వాకర్లను ఇబ్బందికి గురిచేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజూ ఇదే తంతు కొనసాగుతోంది.

హైదరాబాద్: వాయువేగంతో దూసుకుపోతున్న బైకు రేసర్లకు హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పోలీసులు కళ్లెం వేశారు. ఓల్‌ సిటీకి చెందిన పలువురు విద్యార్థులు గండిపేట ప్రాంతంలో బైక్ రేసింగ్‌ నిర్వహించారు.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరో మలుపు తిరగనుంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసుగా పరిగణించే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్‌ సన్‌తో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ వల వేసినట్లు సమాచారం. రేవంత్ బెయిల్ పిటీషన్‌లో ఏజీ ప్రత్యేక వాదనలు వినిపించనుంది.

హైదరాబాద్: ఓయూ పరిశోధక విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూ పరిశోధక విద్యార్థులు చేపట్టిన నిరవదిక దీక్ష 15వ రోజుకు చేరుకుంది. మెస్‌ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Pages

Don't Miss