బ్రేవ్ బాయ్ : రోడ్డు కావాలంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన బాలుడు
The boy who questioned the MLA : ఓటు వేసిన వారంతా సైలెంట్‌గా ఉన్నారు. ఓటు హక్కులేని ఓ బాలుడు మాత్రం ధైర్యం చేశాడు. ముందుకొచ్చాడు. తమ కాలనీకి రోడ్డు వేయలంటూ అడిగాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిందీ ఘటన.
సర్వారెడ్డిపల్లిలో పర్యటించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను యశ్వంత్ అనే బాలుడు ప్రశ్నించాడు. గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు వచ్చిన రవిశంకర్‌ను రోడ్డు కావాలంటూ జనం మధ్యలోనే యశ్వంత్ అడిగాడు. బాలుడి ధైర్యానికి ఎమ్మెల్యే ముగ్ధులయ్యారు.
వెంటనే సానుకులంగా స్పందించారు. కాలనీకి సంబంధించిన రోడ్డు పని ఎస్టిమేషన్ వేయాలని అధికారులకు రవిశంకర్ సూచించారు. రోడ్డు నిర్మించేందుకు ప్రక్రియ చేపట్టాలంటూ ఆదేశించారు.