RRR టాక్స్ పేరుతో రూ. 6 వేల కోట్లు వసూలు.. రేవంత్‌పై సంచలన ఆరోపణలు
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను సెటిల్మెంట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.

Alleti Maheshwar Reddy (Photo: @BJP4Telangana)
Alleti Maheshwar Reddy on RRR Tax: సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. RRR ట్యాక్స్ అంటే.. R అంటే రాహుల్ గాంధీ R అంటే రేవంత్ రెడ్డి R అంటే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని నిర్వచించారు. అబద్దాల పునాదుల మీద సీఎం పదవిని చేపట్టిన రేవంత్.. రాష్ట్రాన్ని దోచునేందుకు శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను సెటిల్మెంట్ బ్రాండ్‌గా మార్చారని మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
”ఏడాది కడుపు కట్టుకుంటే 40 వేల కోట్ల రూపాయలు వస్తాయని రేవంత్ అంటుండు. ఏ కడుపు కట్టుకుంటే వస్తాయి? రాష్ట్ర మిగులుకి 40 వేల కోట్లకు ఏమైనా సంబంధం ఉందా?ఇది ఏరకంగా ప్రభుత్వ ఆదాయం అవుతదో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల తర్వాత కన్‌స్ట్రక్షన్‌కు పర్మిషన్స్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? హైదరాబాద్‌ను సెటిల్మెంట్ బ్రాండ్‌గా మార్చారు. దీంతో అనేక నిర్మాణ కంపెనీలు భయపడి రాష్ట్రానికి రావట్లేదు. దీనికి కారణం సీఎం రేవంత్ అసమర్థత. ట్యాక్స్‌ల పేరుతో వసూళ్ళు.
గతంలో కేటీఆర్ ఫ్లోర్ లెక్కన తీసుకుంటే.. రేవంత్ మాత్రం నగదు కావాలని అడుగుతున్నాడంట. RRR టాక్స్‌కి రసీదులు ఉండవు, చెక్కులు ఉండవు. అన్ని క్యాష్ అండ్ క్యారీ. రాష్ట్రంలో బిల్లులు లేకుండా కొత్త తరహా పన్నులతో వేల కోట్లు అవినీతి జరుగుతోంది. బిల్డర్స్ ఫ్లోర్‌లు ఇస్తామంటే రేవంత్ రెడ్డి క్యాష్ కావాలని అంటున్నారు అంట. వసూల్ చేసిన దాంట్లో చారణ ఢిల్లీకి పంపి.. బారాణ రేవంత్ పెట్టుకుంటున్నారు.
Also Read: చంచల్‌గూడ జైలుకు క్రిశాంక్.. నిజాం కాలేజీ స్టూడెంట్ లీడర్‌పైనా కేసు నమోదు
ఎన్నికల ఖర్చు కోసమే డబ్బులు వసూలు చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్‌కి 68 రూపాయలు RRR టాక్స్ తీసుకుంటుంది నిజం కదా? ఇప్పటి దాకా RRR టాక్స్ పేరుతో రూ. 6 వేల కోట్లు వసూల్ చేశారు. వరుసగా మీది ఒక్కొక్క టాక్స్ బయట పెడతా. మూడు రోజుల్లో మరో అవినీతి బయట పెడతా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను సెటిల్మెంట్ పేరుతో దెబ్బ తీస్తున్నారు. కాళేశ్వరం అవినీతిలో మీరు తీసుకున్న లెక్కలు కూడా బయటపెడతాన”ని వార్నింగ్ ఇచ్చారు.
Live : BJLP Leader Shri Aleti Maheshwar Reddy Press Meet || BJP Telangana https://t.co/PM5vaTOmut
— BJP Telangana (@BJP4Telangana) May 2, 2024