Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక.. షెడ్యూల్ ఇలా..
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

Rahul Gandhi And Priyanka Gandhi
Telangana Congress : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద వర్గాల ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని, రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో హామీల అమలు జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలుకూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
aLPM Modi : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం.. సభలు, రోడ్ షోలలో పాల్గోనున్న ప్రధాని
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గోనున్నారు. మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ ఈనెల 5న తెలంగాణకు రానున్నారు. 5వ తేదీ ఉదయం 11గంటలకు నిర్మల్ బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం గద్వాల్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గోనున్నారు. 9వ తేదీన ఉదయం 11గంటలకు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు.
Also Read : Venkatesh Daggubati : ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్.. వియ్యంకుడి కోసం హీరో వెంకటేశ్ ప్రచారం
ప్రియాంక గాంధీ ఈనెల 6, 7 తేదీల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6వ తేదీన ఉదయం 11గంటలకు ఎల్లారెడ్డిలో జరగనున్న బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 3గంటలకు తాండూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం నర్సాపూర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్న ప్రియాంక గాంధీ.. సాయంత్రం కూకట్ పల్లిలో జరగనున్న బహిరంగ సభలోనూ పాల్గొంటారు.