లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 04:20 AM IST
లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే

ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నారా..అయితే మీరు ఒత్తిడికి గురవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయాలు తీసుకోకుండా ఫాస్ట్ ఫుడ్‌పై ఆధార పడుతున్నారు. పరీక్షల సమయంలో ఈ ఫుడ్ తీసుకుంటున్నారు. ఫలితంగా ఒత్తిడికి గురవుతున్నారని యూనివర్సిటీ ప్రొఫెసర్లు వెల్లడిస్తున్నారు. బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీకి చెందిన నటాలీ మైఖెల్స్ దీనిపై పరిశోధనలు జరిపారు.

ఒత్తిడి సమయంలో కొవ్వులు, చక్కెరలు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొనేందుకు చాలా మంది మొగ్గు చూపుతారని నటాలీ వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ పరీక్షల సమయంలో విద్యార్థుల ఆహారపు అలవాట్ల గురించి తాము ఒక అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు.

ఒత్తిడికి, ఆహారానికి దగ్గరి సంబంధం ఉందనే సిద్ధాంతం రుజువైందన్నారు. వివరాలను బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ కార్యక్రమంలో నటాలి వెల్లడించారు. 
Also Read : ఎక్కడికైనా చెప్పి వెళ్లండి : మహిళా టెకీలకు పోలీసుల సూచనలు