వారి భద్రత సంస్థలదే : మహిళా టెకీలకు పోలీసుల సూచనలు

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 05:50 AM IST
వారి భద్రత సంస్థలదే : మహిళా టెకీలకు పోలీసుల సూచనలు

హైదరాబాద్ నగరం ప్రాచీన చరిత్ర..ఆధునికత మేళవింపుగా హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగంలో మహిళల శాతం తక్కువేమీ కాదు. ఐటీ రంగం అంటేనే వేళ కాని వేళల్లో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉమెన్ టెకీ భద్రత విషయంలో సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మహిళలపై జరుగుతున్న పలు నేరాలను దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు టెకీలు ఎక్కడికైనా వెళ్లాలనుకునే సందర్భంలో ఇంటిలో పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. 
Also Read : లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే

హైదరాబాద్‌ నగర పరిధిలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 8.30 గంటలు దాటితే కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగుల బాధ్యత ఆయా సంస్థలదేనని స్పష్టం చేశారు. 8.30 గంటల తర్వాత విధులు ముగించుకుని వెళ్లే ఉద్యోగినులకు రవాణా ఏర్పాట్లు సంస్థ యాజమాన్యమే ఏర్పాటుచేయాలని, వారు ఇంటికి ఏ సమయంలో బయలుదేరారు, ఏ వాహనంలో వస్తున్నారన్న సమాచారం కుటుంబసభ్యులకు చేరవేసే బాధ్యత సంస్థలదేనని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. 

ఒకవేళ ఉద్యోగిని కంపెనీ ఏర్పాటుచేసిన వాహనంలో వెళ్లేందుకు ఇష్టపకడపోయినా, ఇతర మార్గాల్లో ఇంటికి వెళ్లాలనుకున్నా..దానికి సంబంధించిన వివరాలతో కూడిన లెటర్ రాయించుకుని వారితో సంతకం చేయించుకోవాలని సైబరబాద్ పోలీసులు తెలిపారు.  కార్మిక చట్టం సెక్షన్ 3వీ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 

ఆయా ఐటీ సంస్థలకు, ఉద్యోగినులకు పోలీసు సహకారం అవసరమైతే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  వేళ కాని వేళ్లలో ప్రయాణించే మహిళా టెకీలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుందని ఈ విషయాన్ని మహిళా టెకీలు దృష్టిలో పెట్టుకోవాలని సైబరాబాద్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సూచించారు. 
Also Read : యతి ఉందా? : భారత ఆర్మీ ఫోటోలపై శాస్త్రవేత్తలు ఏమన్నారు