బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!

వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 08:46 AM IST
బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!

వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం.

వేడి వేడి టీ కడుపులో పడితే గానీ రిలాక్స్ కాదు చాలామందికి. లిమిట్ గా తీసుకుంటే కాఫీ, టీ మంచివే. కానీ అంత వేడిగా తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం. టీ చల్లారిందంటే అస్సలు తాగలేం పొగలుగక్కే టీ అయితేనే తాగినట్టు ఉంటుందంటారు కొంతమంది. టీ ఎంత వేడిగా ఉంటే అంత టేస్టీగా అనిపిస్తుందేమో గానీ ఆరోగ్యానికి మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. టీ తో చాలా వరకు లాభాలే ఉన్నాయి. కానీ వేడిగా తాగితే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : హెల్త్ టిప్ : ఎడమ వైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే

చైనాలో జరిగిన పరిశోధన ప్రకారం క్యాన్సర్ కు కారణమయ్యే స్మోకింగ్, ఆల్కహాల్ లకు తోడు టీ, కాఫీలను వేడి వేడిగా తాగితే అవి క్యాన్సర్ కు కాక్ టెయిల్ అవుతాయంటున్నారు. ఇలాంటి వాళ్లలో అన్నవాహిక క్యాన్సర్ రిస్కు 5 వంతులు ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు వాళ్లలో 9 ఏళ్ల పాటు ఈ రీసెర్చ్ చేశారు. రెగ్యులర్ గా వేడి వేడి టీ తీసుకునేవాళ్లలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్టు దీనిలో గమనించారు.

నిజానికి గోరువెచ్చని కప్పు కాఫీ వల్ల ప్రమాదం లేకపోగా లాభాలు కూడా ఉన్నాయి. గోరువెచ్చని లేదా చల్లని కాఫీ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15 శాతం తగ్గుతుందని ఇంతకుముందే లాన్సెట్ ఆంకాలజీ పత్రికలో ప్రచురితమైంది. టీ ఒక్కటే కాదు.. కాఫీ గానీ, గ్రీన్ టీ గానీ ఏ డ్రింక్ తాగుతున్నామన్నది సమస్య కాదు.. అది ఏ టెంపరేచర్ లో ఉన్నదనేదే విషయం. వేడి వల్లనే క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ వేడి ఎలా క్యాన్సర్ కు కారణమవుతుందనే విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఏది ఏమైనా వేడి వేడి పానీయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలూ ఉండవు కాబట్టి వాటిని చల్లబరిచి తాగడమే మేలు.
Also Read : లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే