చంద్రయాన్-2: సెప్టెంబర్ 6న చంద్రునిపైకి!

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 02:12 AM IST
చంద్రయాన్-2: సెప్టెంబర్ 6న చంద్రునిపైకి!

చంద్రుడుపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది ఇస్రో. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్బిటర్‌, ల్యాండర్‌(విక్రం), రోవర్‌(ప్రజ్ఞాన్‌) పేరిట మూడు మాడ్యూళ్లను జి.ఎస్‌.ఎల్‌.వి. ఎం.కె-3 లాంచ్‌ వెహికల్‌తో ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

చంద్రుడి ఉపరితలానికి చేరువలో ఆర్బిటర్‌, దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌, ఉపరితలంపై ప్రయోగాలను నిర్వహించేందుకు అనువుగా రోవర్‌ను తయారుచేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగంను జులై 9 నుంచి 16 మధ్యలో ప్రయోగిస్తారు. 2019 సెప్టెంబరు ఆరవ తేదీ నాటికి ఇవి చంద్రునిపైకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇస్రో అధికారులు. 
Also Read : హెల్త్ టిప్ : ఎడమ వైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే