ఒక్క నిమిషం నిబంధన అమలు : మే 03న తెలంగాణలో ఎంసెట్

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 03:28 AM IST
ఒక్క నిమిషం నిబంధన అమలు : మే 03న తెలంగాణలో ఎంసెట్

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ – 2019 ఆన్ లైన్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 03 నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 8,9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్క్రీమ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. రోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది.

18 పట్టణాల పరిధిలోని 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాలు, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాలున్నాయి. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. దరఖాస్తు దారుల్లో ఐదుగురు ట్రాన్స్ జెండర్లున్నారు. 
Also Read : హెల్త్ టిప్ : ఎడమ వైపు తిరిగి పడుకుంటే కలిగే లాభాలు ఇవే

ఎంసెట్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన ఉంటుందని అధికారులు వెల్లడించారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని..నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. ఉదయం స్టార్ట్ అయ్యే ఎగ్జామ్‌కు ఉదయం 8.30గంటల నుండి విద్యార్థులు కేంద్రానికి పంపిస్తామన్నారు. మధ్యాహ్నం ప్రారంభమ్యే పరీక్షకు 1.30గంటల నుండి పరీక్ష హాల్‌లోకి అనుమతినిస్తామన్నారు. 

విద్యార్థులకు సూచనలు
హాల్ టికెట్ లేకుండా విద్యార్థులను అనుమతించరు. 
తమ పరీక్ష కేంద్రానికి ఒక రోజు ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్. కేంద్రానికి వీలైనంత తొందరగా చేరుకోవాలి. 
హాల్ టికెట్, పూర్తి చేసిన ఆన్ లైన్ దరఖాస్తు ఫారం, బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులయితే అటెస్ట్ చేసిన కుల ధృవీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి. 
పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే ముందుగా బయో మెట్రిక్ డేటాను నమోదు చేసుకోవాలి. 
Also Read : టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు