టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 04:06 AM IST
టీఎస్ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2019-2020 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2019 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఈ మేరకు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొ.సీహెచ్. రాజేశం బుధవారం (మే2, 2019) వెల్లడించారు. మే 9 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

అపరాధ రుసుము లేకుండా మే 3 వ తేదీ వరకు ఉన్న గడువును మే 9వ తేదీ వరకు పొడిగించామన్నారు. రూ. 500 అపరాధ రుసుముతో మే 12 వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే 23, 24వ తేదీల్లో పరీక్ష జరుగనుంది. మే 14 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చాన్నారు.
Also Read : ఒక్క నిమిషం నిబంధన అమలు : మే 03న తెలంగాణలో ఎంసెట్